Biomedical Engineering: బయోమెడికల్ ఇంజనీరింగ్‌తో.. కెరీర్ అవకాశాలు.. 6 d ago

ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్ధులు ఆసక్తి చూపుతున్న కోర్సుల్లో బయోమెడికల్ ఇంజినీరింగ్ ఒకటి. బయోమెడికల్ ఇంజినీరింగ్ ఆరోగ్య రంగానికి సాంకేతిక తోడ్పాటు అందించడంతో పాటు ప్రధానంగా రోగ నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే ఎకోకార్డియోగ్రాఫ్, MRI, CT స్కానర్, ఎక్స్ రే పరికరాలను తయారు చేస్తుంది. ఈ కోర్సు కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం!
బయోలజీ, మెడిసిన్‌లకు సాంకేతికతలను జోడించి మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను తయారు చేసేదే ఇంజినీరింగ్ కోర్సు. ఈ బయోమెడికల్ ఇంజినీర్లు నాణ్యమైన పరికరాలను తక్కువ ధరల్లో తయారు చేసేందుకు కృషి చేస్తారు. ఇది రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉన్న రంగంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రోగ నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్ ఎంఆర్ఐలతో పాటు రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఉపయోగించే ఇతర పరికరాలను తయారు చేసే వారే బయో మెడికల్ ఇంజనీర్లు. వీటిని తయారు చేయడానికి ఇంజినీరింగ్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. బయాలజీ ఇంజినీరింగ్ ఈ రెండింటిపై అవగాహన ఉండాలి. అందుకే ఈ రెండింటిని కలిపి ఉమ్మడిగా బయో మెడికల్ ఇంజినీరింగ్ కోర్సును రూపొందించారు.
ప్రవేశాలు:
పదో తరగతి చదివిన తర్వాత ఇంటర్‌లో MPC లేదా BiPC చదివి ఉండాలి. అనంతరం ప్రవేశ పరీక్షల(ఎమ్‌సెట్/జేఈఈ) ద్వారా నాలుగు సంవత్సరాల బీఎస్సీ బయోమెడికల్ సైన్స్, బీటెక్ బయోమెడికల్ ఇంజినీరింగ్, బీటెక్ బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, బీటెక్ బయోటెక్నాలజీ, బీఈ బయోమెడికల్ ఇంజినీరింగ్ చదవచ్చు. తర్వాత పీజీ స్ధాయిలో ఎమ్‌టెక్ బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎమ్ఈ బయోకెమికల్ ఇంజినీరింగ్, ఎమ్ఎస్సీ బయోమెడికల్ ఇంజినీరింగ్, పీహెచ్‌డీ బయోమెడికల్ లాంటి కోర్సులు చేయోచ్చు.
ఉద్యోగావకాశాలు....
ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులు బయోమెడికల్ టెక్నిషియన్, బయో మెడికల్ ఇంజినీర్, బయో కెమిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తారు. మెడికల్ కంపెనీలు, ఇన్‌స్ట్రుమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇన్‌స్టాలేషన్ యూనిట్‌లలో, రీసెర్చ్ ల్యాబ్స్‌లో, హాస్పిటల్స్‌లో, నర్సింగ్ హోమ్స్‌లో, మెడిసిన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీస్‌లో, హెల్త్ కేర్ కంపెనీస్‌లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
ఈ రోజుల్లో బయోమెడికల్ ఇంజినీర్లకి బాగా డిమాండ్ ఉంది. పేషెంట్స్ కి ఆపరేషన్ చేసేటప్పుడు మెషిన్స్ పెడతారు. ఇవి సరిగా ఉన్నాయా! సరిగా పనిచేస్తున్నాయా! అనేది చూడాలి. ఎవరికైనా చేతులు కానీ, కాళ్లు కానీ లేకపోతే రోబోటిక్స్ హ్యాండ్స్‌ని, లెగ్స్‌ని అడుగుతారు. వీటిని తయారు చేయడానికి బయోమెడికల్ ఇంజినీర్ అవసరం. బయోమెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు కెరీర్ లో ఉన్నత స్ధితి చేరతారనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇది చదవండి: ఆటోమొబైల్ రంగంలో అపార అవకాశాలు..